Anand Mahindra: ఆ విషయం బయటకు చెబితే ఉద్యోగంలో నుంచి తీసేస్తారంటున్న ఆనంద్ మహీంద్రా, ట్విట్టర్లో వైరల్ అవుతున్న ట్వీట్
‘‘ష్.. ఒకవేళ అది చెప్తే.. నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు. కానీ, ఒక్క విషయం మాత్రం చెప్పగలను. నేను కూడా మీలాగే ఆత్రుతతో ఉన్నా’’ అంటూ బదులిచ్చారాయన. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవులతోంది.
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. తాజాగా ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు.. మాత్రం సమాధానం ఇవ్వలేకపోయాడు. కానీ, ఫన్నీగా మాత్రం ఓ బదులు ఇచ్చారు ఆయన. ఐఎన్‌సీ ప్రాజెక్టు మేకర్స్ అనే ట్విటర్ అకౌంట్ నుంచి.. ‘‘సర్.. స్కారిపియో ఎప్పుడు లాంఛ్ అవుతుంది? మేం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం.. తేదీ ఎప్పటి నుంచో చెప్పండి’’ అంటూ ఆనంద్ మహీంద్రాకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనికి ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ‘‘ష్.. ఒకవేళ అది చెప్తే.. నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు. కానీ, ఒక్క విషయం మాత్రం చెప్పగలను. నేను కూడా మీలాగే ఆత్రుతతో ఉన్నా’’ అంటూ బదులిచ్చారాయన. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవులతోంది. అయితే కంపెనీ కొత్త స్కార్పియో విషయంలో ఎలాంటి తేదీని ప్రకటించలేదు. జూన్‌లో.. అదీ కంపెనీ 20వ వార్షికోత్సవం సందర్భంగా లాంఛ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)