Delhi Liquor Scam Case: ఈడీ మా ఇంట్లో ఎన్నిసార్లు రైడ్ చేసినా చిల్లిగ‌వ్వ కూడా దొర‌క‌లేదు, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునితా కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు, రేపు కోర్టులో డబ్బు గురించి చెబుతారని వెల్లడి

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్ర‌స్తుతం ఈడీ క‌స్ట‌డీలో ఉన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న భార్య సునితా కేజ్రీవాల్(Sunita Kejriwal) ఇవాళ మీడియాతో మాట్లాడారు. ప‌లుమార్లు ఈడీ త‌మ ఇండ్ల‌ల్లో రెయిడ్ చేసినా.. ఒక్క‌సారి కూడా చిల్లిగ‌వ్వ దొర‌క‌లేద‌ని ఆమె అన్నారు.

Sunita Kejriwal Says Arvind Kejriwal Will Do 'Big Expose' in Delhi Liquor 'Scam' on March 28 in Court (Watch Video)

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్ర‌స్తుతం ఈడీ క‌స్ట‌డీలో ఉన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న భార్య సునితా కేజ్రీవాల్(Sunita Kejriwal) ఇవాళ మీడియాతో మాట్లాడారు. ప‌లుమార్లు ఈడీ త‌మ ఇండ్ల‌ల్లో రెయిడ్ చేసినా.. ఒక్క‌సారి కూడా చిల్లిగ‌వ్వ దొర‌క‌లేద‌ని ఆమె అన్నారు. మార్చి 28వ తేదీన కేజ్రీవాల్ కోర్టు ముందు హాజ‌రు అవుతార‌ని, కోర్టులో ఆయ‌న ఆ డ‌బ్బు గురించి వెల్ల‌డిస్తార‌ని సునిత తెలిపారు.జ‌ల‌శాఖ మంత్రికి త‌న భ‌ర్త ఆదేశాలు ఇచ్చార‌ని, కానీ కేంద్రం ఆ విష‌యాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, వాళ్ల‌ను ఢిల్లీని నాశ‌నం చేయాల‌నుకుంటున్నారా అని ఆమె ప్ర‌శ్నించారు

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో (liquor policy case) ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) కస్టడీ రేపటితో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కస్టడీ (custody)కి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్ ని ఈనెల 21న అదుపులోకి తీసుకోగా, రౌస్‌ అవెన్యూ కోర్టు ఏడు రోజుల పాటు అంటే ఈనెల 28వరకూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) కస్టడీకి అప్పగించింది. కోర్టు విధించిన కేజ్రీ కస్టడీ రేపటితో ముగియనుంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now