Supreme Court: ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసు, నిందితుడికి విధించిన మరణశిక్షను రద్దు చేసి 20 ఏళ్ల జీవితఖైదుకు మార్చిన సుప్రీంకోర్టు
అతనిపై ఉన్న మరణశిక్ష(Death Sentence)ను కోర్టు సడలించింది. 2009లో జరిగిన మర్డర్ కేసులో సుందర్‌రాజన్‌కు గతంలో మరణశిక్ష విధించారు.
తమిళనాడులో ఏడేళ్ల అబ్బాయిని కిడ్నాప్ చేసి, హత్య చేసిన కేసులో (Tamilnadu)కు చెందిన సుందర్‌రాజన్(Sunderrajan) అనే వ్యక్తికి సుప్రీంకోర్టు ఇవాళ ఊరట లభించింది. అతనిపై ఉన్న మరణశిక్ష(Death Sentence)ను కోర్టు సడలించింది. 2009లో జరిగిన మర్డర్ కేసులో సుందర్‌రాజన్‌కు గతంలో మరణశిక్ష విధించారు. సీజేఐ(CJI) డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ, పీఎస్ నర్సింహాలతో కూడిన ధర్మాసనం ఇవాళ తాజా తీర్పును వెలువరించింది.
జడ్జి మహమ్మద్ ఆరిఫ్ ఇచ్చిన తీర్పును పరిశీలించామని, సుందర్‌రాజన్ మరణశిక్షను రద్దు చేసి.. నిందితుడికి 20 ఏళ్ల జీవితఖైదును విధిస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది. కోర్టులో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన కడలూరు పోలీసులపై కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేశారు. 2103లో సుప్రీంకోర్టు ఈ కేసులో మరణశిక్ష విధించింది. ఆ ఏడాది మార్చిలో సుందర్‌రాజన్ వేసిన రివ్యూ పిటీషన్లను సుప్రీం కొట్టి పారేసింది.
Here's Bar Bench Tweet