Same Sex Marriage: సేమ్ సెక్స్ మ్యారేజ్‌‌కు ప్రత్యేక వివాహ చట్టం కోరుతూ పిటిషన్, సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణ అప్పుడే చేపడతామని వెల్లడి

స్వలింప సంపర్క వివాహాలకు ప్రత్యేక వివాహం చట్టం వర్తింపజేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు గేలు సుప్రియో, అభ‌య్‌ లు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

same sex marriage (Photo-Twitter/Live Law)

స్వలింప సంపర్క వివాహాలకు ప్రత్యేక వివాహం చట్టం వర్తింపజేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు గేలు సుప్రియో, అభ‌య్‌ లు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్‌పై విచారణ జరిపేందుకు అంగీకరించింది. నేటి విచారణలో భాగంగా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు అటార్నీ జనరల్‌ నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పంపింది.

తదుపరి విచారణ అప్పుడే చేపడతామని పేర్కొంది. సుప్రియో, అభ‌య్‌ జంటతో పాటు ప‌ర్త్ పిరోజ్ మెహ‌రోత్రా, ఉద‌య్ రాజ్ అనే మ‌రో జంట రెండో పిటిష‌న్ వేసింది. సేమ్ సెక్స్ మ్యారేజ్‌ను గుర్తించ‌క‌పోతే అది స‌మాన‌త్వ హ‌క్కును ఉల్లంఘించినట్లే అవుతుందని వీరు పిటిషన్ లో పేర్కొన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement