Maoist Link Case: సాయిబాబాకు సుప్రీంకోర్టులో భారీ షాక్, బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మళ్లీ విచారణ జరపాలని ఆదేశాలు, మావోయిస్టులు, బాంబే హైకోర్టు
మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో సాయిబాబాను నిర్ధోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. ఈ కేసులో మరోసారి విచారణ జరపాలని బాంబే హైకోర్టును బుధవారం ఆదేశించింది.
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రోఫెసర్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో సాయిబాబాను నిర్ధోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. ఈ కేసులో మరోసారి విచారణ జరపాలని బాంబే హైకోర్టును బుధవారం ఆదేశించింది. ఈ మేరకు నాలుగు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఎమ్ ఆర్ షా, సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
గతేడాది అక్టోబర్ 15న చట్ట వ్యతిరే కార్యకలాపాల చట్టం(యూఏపీఏ) కింద.. సాయిబాబా ఇతరులపై ప్రాసిక్యూషన్ చెల్లుబాటు కాదని కొట్టేసిన బాంబే హైకోర్టు.. వాళ్లను తక్షణమే విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు ఎన్‌ఐఏ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు స్పందిస్తూ.. ట్రయల్ కోర్టుల తీర్పు ప్రకారం దోషులుగా నిర్థారించిన వారి నేరాల తీవ్రతను బాంబే హైకోర్టు పరిగణలోనికి తీసుకోలేదని అభిప్రాయపడింది.
Here's Live Law Tweet