Swachh Survekshan Awards 2021: దేశంలో స్వచ్ఛ‌మైన న‌గ‌రంగా ఇండోర్, మూడవ స్థానంలో విజయవాడ, స్వ‌చ్ఛ్ స‌ర్వేక్ష‌ణ్-2021 అవార్డులను ప్రకటించిన కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ‌‌

దేశంలోనే అత్యంత స్వచ్ఛ‌మైన న‌గ‌రంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ మరోసారి ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో సూర‌త్‌(గుజరాత్), ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశంలో పరిశుభ్ర రాష్ట్రంగా జార్ఖండ్ ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది.

President Ram Nath Kovind confers Indore the cleanest city award for the 5th consecutive year, at Swachh Survekshan Awards 2021. (Photo/ ANI)

దేశంలోనే అత్యంత స్వచ్ఛ‌మైన న‌గ‌రంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ మరోసారి ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో సూర‌త్‌(గుజరాత్), ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశంలో పరిశుభ్ర రాష్ట్రంగా జార్ఖండ్ ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ‌‌ ‘స్వ‌చ్ఛ్ స‌ర్వేక్ష‌ణ్-2021’ అవార్డులను శనివారం ప్ర‌క‌టించింది. విజేతలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అవార్డులను ప్రదానం చేశారు. ఇండోర్‌ తొలి స్థానాన్ని కైవసం చేసుకోవ‌డం ఇది అయిదోసారి.

కాగా ఇండోర్ సాధించిన విజయానికి నగర ప్రజలకు కలెక్టర్‌ అభినందనలు తెలిపారు. ‘ఇండోర్ నగరాన్ని దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా ఐదవసారి నిలిపినందుకు ఇండోర్ వాసులకు అభినందనలు. పౌరులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం వల్లే ఇది సాధ్యమైంది’ అని కలెక్టర్ మనీష్ సింగ్ ట్వీట్‌ చేశారు. అంతేగాక ఇంతకుముందు దేశంలోనే తొలి వాటర్‌ ప్లస్‌ నగరంగా ఇండోర్‌ నిలిచింది. ఇదిలా ఉండగా స్వచ్ఛ్ సర్వేక్షణ్ అనేది ‘స్వచ్ఛ భారత్ మిషన్‌’లో భాగంగా దేశంలోని నగరాలు, పట్టణాలలో పరిశుభ్రత, పారిశుద్ధ్యానికి సంబంధించిన వార్షిక సర్వేగా చెబుతారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement