Swati Maliwal Fight Video: వీడియో ఇదిగో, కేజ్రీవాల్ ఇంటివద్ద సిబ్బందితో గొడవపడిన స్వాతిమాల్, తనను తాకితే ఉద్యోగం పోతుందంటూ బెదిరింపులు, వీడియోపై ఆప్ ఎంపీ ఏమన్నారంటే..
అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరిన కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉన్న సిబ్బందితో స్వాతి మలివాల్ వాదనకు దిగింది. తాను ఇప్పటికే పోలీసులకు ఫోన్ చేశానని, పోలీసులు వచ్చిన తర్వాతే వెళ్లతానని వారితో అన్నది
కేజ్రీవాల్ ఇంట్లో జరిగిన సంఘటనకు సంబంధించిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరిన కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉన్న సిబ్బందితో స్వాతి మలివాల్ వాదనకు దిగింది. తాను ఇప్పటికే పోలీసులకు ఫోన్ చేశానని, పోలీసులు వచ్చిన తర్వాతే వెళ్లతానని వారితో అన్నది. అలాగే తనను తాకితే ఉద్యోగం పోతుందంటూ అక్కడ ఉన్న సిబ్బందిని ఆమె బెదిరించింది. స్వాతిమాలీవాల్‌పై దాడి కేసులో ట్విస్ట్, కేజ్రీవాల్ ఇంట్లో సిబ్బందితో స్వాతి మలివాల్ వాగ్వాదం వీడియో వైరల్, ఘటనపై ఎవరేమన్నారంటే..
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో క్లిప్‌పై స్వాతి మలివాల్ స్పందించింది. తనను తాను రక్షించుకోవడానికి ‘రాజకీయ హిట్‌మ్యాన్’ ప్రయత్నాలు ప్రారంభించాడని ఆరోపించింది. తన వ్యక్తులతో ట్వీట్ చేయించడం, సగం వీడియోలను పోస్ట్ చేయించడం ద్వారా ఈ నేరం నుంచి తప్పించుకోగలనని అతడు భావిస్తున్నాడు. ఒకరిని కొట్టేటప్పుడు వీడియో ఎవరు తీస్తారు? ఆ గదిలోని సీసీటీవీ ఫుటేజీని పూర్తిగా పరిశీలిస్తే అసలు విషయం అందరికీ తెలుస్తుంది. ఏ స్థాయికి దిగజారాలని కోరుకుంటున్నావో? దేవుడు చూస్తున్నాడు. ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది’ అని ఎక్స్‌లో ఆమె పోస్ట్ చేసింది.
Here's Video
Her Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)