Ram Temple Inauguration: తమిళనాడులో రామమందిర వేడుకలు బంద్, సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీజేపీ, స్టాలిన్ సర్కారు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని పిటిషన్‌లో వెల్లడి
రామ్‌లల్లా 'ప్రాణప్రతిష్ఠ' ప్రత్యక్ష ప్రసారాన్ని నిషేధిస్తూ డీఎంకే నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఆదేశాలపై బీజేపీ అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమిళనాడు బిజెపి కార్యదర్శి వినోజ్ పి సెల్వం తరపున న్యాయవాది జి బాలాజీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
రామ్‌లల్లా 'ప్రాణప్రతిష్ఠ' ప్రత్యక్ష ప్రసారాన్ని నిషేధిస్తూ డీఎంకే నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఆదేశాలపై బీజేపీ అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమిళనాడు బిజెపి కార్యదర్శి వినోజ్ పి సెల్వం తరపున న్యాయవాది జి బాలాజీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోని అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ’ యొక్క పవిత్రమైన సందర్భాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని డిఎంకె రాజకీయ పార్టీ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిందని దీనిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం (పోలీసు అధికారుల ద్వారా) వ్యక్తిగతంగా అధికారాన్ని వినియోగించుకోవడం రాజ్యాంగం ప్రకారం హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుంది" అని పేర్కొందని పిటిషన్ లో తెలిపింది. ఈ విషయంలో వెంటనే న్యాయపరమైన జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును బీజేపీ పిటిషన్ దారు కోరారు.
Here's ANI Tweet