Tamil Nadu Govt Extends Lockdown: సెప్టెంబ‌ర్ 6 వ‌ర‌కు లాక్‌డౌన్‌ పొడిగింపు, లాక్‌డౌన్ నియంత్ర‌ణ‌ల‌కు భారీ స‌డ‌లింపుల‌ు ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం, రాత్రి ప‌ది గంట‌ల వ‌ర‌కూ వాణిజ్య సేవలు

క‌రోనా క‌ట్ట‌డికి విధించిన లాక్‌డౌన్‌ను సెప్టెంబ‌ర్ 6 వ‌ర‌కూ పొడిగించిన‌ట్టు (Tamil Nadu Govt Extends Lockdown) త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం శ‌నివారం వెల్ల‌డించింది. అయితే లాక్‌డౌన్ నియంత్ర‌ణ‌ల‌కు భారీ స‌డ‌లింపుల‌ను (Additional Relaxations) ప్ర‌క‌టించింది. ఆగ‌స్ట్ 23 నుంచి థియేట‌ర్ల‌ను 50 శాతం సీటింగ్ సామ‌ర్ధ్యంతో తెరిచేందుకు అనుమ‌తించింది.

COVID-19 lockdown (Photo Credit: PTI)

క‌రోనా క‌ట్ట‌డికి విధించిన లాక్‌డౌన్‌ను సెప్టెంబ‌ర్ 6 వ‌ర‌కూ పొడిగించిన‌ట్టు (Tamil Nadu Govt Extends Lockdown) త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం శ‌నివారం వెల్ల‌డించింది. అయితే లాక్‌డౌన్ నియంత్ర‌ణ‌ల‌కు భారీ స‌డ‌లింపుల‌ను (Additional Relaxations) ప్ర‌క‌టించింది. ఆగ‌స్ట్ 23 నుంచి థియేట‌ర్ల‌ను 50 శాతం సీటింగ్ సామ‌ర్ధ్యంతో తెరిచేందుకు అనుమ‌తించింది. ప్ర‌జ‌ల సంద‌ర్శ‌న కోసం బీచ్‌ల‌ను ఓపెన్ చేయ‌నున్నారు. అన్ని షాపులు, వాణిజ్య సంస్ధ‌ల‌ను రాత్రి ప‌ది గంట‌ల వ‌ర‌కూ ప‌నిచేసేందుకు అనుమ‌తించారు. ఐటీ కార్యాల‌యాలు నూరు శాతం సిబ్బందితో ప‌నిచేసే వెసులుబాటు క‌ల్పించారు. ఏపీ, క‌ర్నాట‌క‌కు అంత‌రాష్ట్ర బ‌స్సుల‌ను అనుమ‌తించ‌నున్న‌ట్టు రాష్ట్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. బార్లు, రిసార్టులు, లాడ్జిలు తెరిచేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇక త‌మిళ‌నాడులో తాజాగా 1668 క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement