Tamil Nadu Rains: తమిళనాడులో భారీ వర్షాలు, విరిగిపడిన కొండచరియలు, ప్రయాణికుల బస్సుపై పడిన చెట్లు
భారీ వర్షాల ప్రభావంతో దాదాపుగా ఆరు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఈ వర్షాలు ధాటికి కొండచరియలు సైతం విరిగిపడుతున్నాయి.
తమిళనాడులో గత రెండు మూడు రోజుల నుంచి వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. భారీ వర్షాల ప్రభావంతో దాదాపుగా ఆరు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఈ వర్షాలు ధాటికి కొండచరియలు సైతం విరిగిపడుతున్నాయి. తాజాగా బుర్లియార్ ప్రాంతంలో మెట్టుపాళయం మరియు కూనుర్ సమీపంలో ఓ బస్సుపై చెట్టు పడింది.
అకస్మాతుగా బస్సు మీద చెట్టు పడిపోవడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారి ఉళ్లిక్కిపడ్డారు. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. వచ్చే రెండు రోజుల పాటు ఇలానే భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)