Tamil Nadu: తమిళనాడులో దారుణం, కులం పేరుతో విద్యార్థిని దూషించి మంటల్లోకి తోసేసిన మరికొందరు విద్యార్థులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థి

ఒక విద్యార్థిని మరికొందరు విద్యార్థులు కులం పేరుతో దూషించడంతో పాటు అతన్ని మంటల్లోకి తోసేశారు. దీంతో అతడికి కాలిన గాయాలయ్యాయి. తిండివనం పట్టణంలోని కట్టుచివిరి ప్రభుత్వ పాఠశాలలో 11 ఏండ్ల దళిత విద్యార్థి 6వ తరగతి చదువుతున్నాడు.

Representational Image | (Photo Credits: IANS)

తమిళనాడులోని విలుపురం జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఒక విద్యార్థిని మరికొందరు విద్యార్థులు కులం పేరుతో దూషించడంతో పాటు అతన్ని మంటల్లోకి తోసేశారు. దీంతో అతడికి కాలిన గాయాలయ్యాయి. తిండివనం పట్టణంలోని కట్టుచివిరి ప్రభుత్వ పాఠశాలలో 11 ఏండ్ల దళిత విద్యార్థి 6వ తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు అతడు ఇంటికి బయలుదేరాడు. అయితే అదే స్కూలుకు చెందిన అగ్ర కులానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఒంటిరిగా వెళ్తున్న అతడ్ని కులం పేరుతో దూషించారు. ఆటపట్టించడంతోపాటు కాలుతున్న పొదల్లోకి అతడ్ని తోసేశారు.

దీంతో ఆ విద్యార్థి కాలిన గాయాలతో ఇంటికి చేరాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు చికిత్స కోసం కుమారుడ్ని తిండివనం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఏం జరిగిందని డాక్టర్లు అడగ్గా.. కొందరు అగ్ర కులాల విద్యార్థులు తనను కులం పేరుతో తిట్టి మండుతున్న చెట్ల పొదల్లోకి తోసేశారని చెప్పాడు. తన చొక్కాకు మంటలు అంటుకోగా సమీపంలోని చెరువులో దూకినట్లు తెలిపాడు.దీంతో ఆ విద్యార్థి తండ్రి దీనిపై పోలీసులకు ఫిర్యాడు చేశాడు. బాధిత విద్యార్థి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన పోలీసులు ముగ్గురు విద్యార్థులపై హత్యాయత్నంతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.