Telangana: వీడియో ఇదిగో, బామర్ది పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ 23 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి, జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన

గ్రామస్తుల కథనం ప్రకారం.. కమ్మరికుంటలో నివాసముంటున్న సంజీవ్ మోతుకురావుపేటలో జరిగే తన మేనమామ కుమారుడి వివాహానికి హాజరయ్యాడు.

Telangana Shocker: 23-year-old dies of heart attack while dancing in wedding procession in Jagtial (Photo-Chota news)

జగిత్యాల జిల్లాలో గల మేడిపల్లి మండలం మోతుకురావుపేటలో బుధవారం అర్థరాత్రి పెళ్లిలో నృత్యం చేస్తూ గుండెపోటుతో సంజీవ్ (23) అనే యువకుడు మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. కమ్మరికుంటలో నివాసముంటున్న సంజీవ్ మోతుకురావుపేటలో జరిగే తన మేనమామ కుమారుడి వివాహానికి హాజరయ్యాడు. పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గుండెపోటుతో సంజీవ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

జగిత్యాలలో దారుణం, అనుమానంతో స్కూలు కెళ్లి విద్యార్థుల ముందే ప్రిన్సిపాల్‌ అయిన భార్యపై దాడి చేసిన భర్త, తమ్ముడు

23-year-old dies of heart attack while dancing in wedding procession

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)