Telangana: లక్ష రూపాయల నగదు తీసుకుంటూ ఏసీబీకీ అడ్డంగా దొరికిన ఎస్‌ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు, తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌లో ఘటన
సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ దాడులు నిర్వహించింది. లక్ష రూపాయల నగదు తీసుకుంటూ ఎస్‌ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. పీడీఎస్ అక్రమ వ్యాపారం కేసులో ఎస్‌ఐ సురేష్ డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితుడు తెలిపారు.

కేసు నుంచి తప్పించాలంటే మూడు లక్షలు డబ్బులు ఇవ్వాలన్న ఎస్సై సురేష్ డిమాండ్ చేయగా, లక్షా ముప్పై వేలకు సెటిల్‌మెంట్ కుదిరింది. రెండు రోజుల క్రితం రూ.30 వేలు ఇచ్చిన బాధితుడు.. తాజాగా మరో లక్ష రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు, డిసెంబర్ మూడున ఎస్‌ఐ సురేష్ నాలుగు లక్షలు తీసుకున్నాడు. తన తమ్ముడు రత్నాకర్ పై నమోదైన కేసులో తానను కూడా కావాలని ఇరికించారని బాధితుడి ఆవేదన వ్యక్తం చేశారు.
SI Suresh and Constable Nagaraju Arrested by ACB
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)