Ananya Nagalla Distributes Blankets: అర్ధరాత్రి పూట హైదరాబాద్ బస్టాండ్ వద్ద పడుకున్న పేదలకు దుప్పట్లు కప్పిన అనన్య నాగళ్ళ, వీడియో ఇదిగో..
అర్ధరాత్రి పూట హైదరాబాద్ బస్టాండ్( Hyderabad Bus Stand ) వద్ద బయట పడుకున్న పలువురు ప్రయాణికులకు, పేదలకు స్వయంగా తానే దుప్పట్లు కప్పింది.పలువురికి దుప్పట్లు చేతికి అందించింది.చలికాలం మొదలవ్వడంతో అనన్య ఇలా బయట రోడ్ల మీద పడుకునే వారికి దుప్పట్లు అందించినట్లు తెలుస్తుంది.
తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ( Heroine Ananya Nagala ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదట నాగ మల్లేశం అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈమె మంచితనం గురించి మనందరికీ తెలిసిందే.మొన్నటికి మొన్న ఏపీలో వరదలు వచ్చిన సమయంలో ఏ హీరోయిన్ స్పందించకపోయినా అనన్య నాగళ్ళ రెండు రాష్ట్రాలకు కలిపి 5 లక్షలు సాయం అందించింది.తాజాగా అనన్య నాగళ్ళ మరో మంచి పనిచేసింది. అర్ధరాత్రి పూట హైదరాబాద్ బస్టాండ్( Hyderabad Bus Stand ) వద్ద బయట పడుకున్న పలువురు ప్రయాణికులకు, పేదలకు స్వయంగా తానే దుప్పట్లు కప్పింది.పలువురికి దుప్పట్లు చేతికి అందించింది.చలికాలం మొదలవ్వడంతో అనన్య ఇలా బయట రోడ్ల మీద పడుకునే వారికి దుప్పట్లు అందించినట్లు తెలుస్తుంది.దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వగా అనన్యను మరోసారి అంతా అభినందిస్తున్నారు.
Ananya Nagalla Distributes Blankets:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)