Telugu States Floods: మా ఆలోచనలన్నీ తెలుగు రాష్ట్రాల ప్రజలతోనే, భారీ వరదల నేపథ్యంలో స్పందించిన రాహుల్ గాంధీ, ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

తన ఆలోచనలు అన్నీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలతోనే ఉన్నాయని పేర్కొన్నారు. వరదల వల్ల ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Rahul Gandhi (Photo-ANI)

తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలపై ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. తన ఆలోచనలు అన్నీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలతోనే ఉన్నాయని పేర్కొన్నారు. వరదల వల్ల ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయక చర్యల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొనాలని సూచించారు.  మంట గలిసిన మానవత్వం, గంగానదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడేందుకు రూ.10 వేలు డిమాండ్ చేసిన గజ ఈతగాడు, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేసేదాకా కదలకుండా..

ప్రస్తుత పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, పునర్నిర్మాణ ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని తెలిపారు. ప్రకృతి విపత్తు కారణంగా నష్టపోయిన వారందరికీ సమగ్ర పునరావాస ప్యాకేజీని సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)