యూపీలో నీళ్లలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడేందుకు గజ ఈతగాడు రూ.10 వేలు డిమాండ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. యూపీలోని ఉన్నావ్ లో గల గంగానది నానాఘట్ వద్ద జరిగిన ఘటన ఇది. స్నేహితులతో కలిసి నది స్నానానికి యూపీ ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదిత్య వర్దన్ సింగ్ వెళ్లారు. అయితే నదిలో ప్రవాహం పెరగడంతో ఆదిత్య వర్దన్ సింగ్ నీటిలో కొట్టుకుపోయారు. తమకు ఈత రాకపోవడంతో కాపాడాలంటూ గజ ఈతగాడు సునీల్ కాశ్యప్ ను స్నేహితులు అర్ధించారు. అయితే అతను రూ.10 వేల డిమాండ్ చేశారు. నగదు లేకపోవడంతో ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ పూర్తయ్యేవరకు గజ ఈతగాడు కదల లేదు. ఈ లోపు అధికారి నదిలో మునిగి చనిపోయాడు. దీనిపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో ఇదిగో, మంచినీళ్లు లేవు, ఆహారం లేదు, కాపాడాలంటూ వీడియో ద్వారా వేడుకున్న విజయవాడ వైఎస్ఆర్ కాలనీవాసులు

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)