కుమారి అంటీ తన మంచి మనసును చాటుకుంది. వరద బాధితుల సహాయార్థం ఆమె ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందించింది. సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆమె ఈ మొత్తాన్ని అందించింది. కుమారి ఆంటీకి ముఖ్యమంత్రి శాలువా కప్పి సన్మానించారు. వరద బాధితులకు తనవంతుగా సాయం చేసినందుకు అభినందించారు.
కుమారి ఆంటీ హైదరాబాద్‌లో రోడ్డు సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకొని బిజినెస్ చేస్తుంటుందన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా కారణంగా గత ఏడాది ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయింది. ఆమె ఫుడ్ స్టాల్‌ను అధికారులు తొలగించడంతో అప్పుడు చర్చకు దారి తీసింది. ఆ తర్వాత ఆమె అక్కడే ఫుడ్ స్టాల్ నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించారు.
Here's Video
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రముఖ 'కుమారి ఆంటీ ఫుడ్స్' నిర్వాహకురాలు కుమారి గారు 50వేల రూపాయల విరాళం అందించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి చెక్కు అందజేశారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ సహాయ కార్యక్రమాలకు అండగా నిలుస్తూ విరాళం… pic.twitter.com/KTiO9TrTHH
— CPRO to CM / Telangana (@CPRO_TGCM) September 18, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)