తూర్పుగోదావరి జిల్లాలో డ్రోన్‌తో బాల గణపతి విగ్రహ నిమజ్జనం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జిల్లాలోని కడియం మండలం కడియపు లంక గ్రామంలో పలువురు చిన్నారులు బాల గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు పూజలు చేశారు. అనంతరం బాల గణపతిని స్థానిక స్నానాల రేవులో నిమజ్జనం చేయాలని భావించారు. అయితే స్నానాల రేవు వద్దకు పోలీసులు పిల్లలను అనుమతించకపోవడంతో వారు ప్రత్యామ్నాయం గురించి ఆలోచించారు. డ్రోన్ నిపుణుడి సాయాన్ని తీసుకున్నారు. బాల గణపతి విగ్రహాన్ని కాలువ మధ్యకు డ్రోన్ తీసుకెళ్లి నిమజ్జనం చేయడంతో పిల్లలు కేరింతలు కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బాల గణపతి నిమజ్జనం హైలైట్ అయ్యింది. వీడియో ఇదిగో, గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి,ఎన్టీఆర్ మార్గ్‌లోని నాలుగో నంబర్ క్రేన్ వద్ద బడా గణేశుడి నిమజ్జనం పూర్తి
Here's Video
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)