The Kerala Story: ద కేరళ స్టోరీ బ్యాన్‌పై స్టే విధించిన సుప్రీంకోర్టు, థియేటర్ల వద్ద సెక్యూర్టీని ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశాలు
సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నర్సింహా, జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం .. బెంగాల్ ఇచ్చిన బ్యాన్ ఆర్డర్‌పై స్టే జారీ చేసింది.
ద కేరళ స్టోరీ(The Kerala Story) చిత్రాన్ని బెంగాల్ ప్రభుత్వం విధించిన బ్యాన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు స్టే విధించింది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నర్సింహా, జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం .. బెంగాల్ ఇచ్చిన బ్యాన్ ఆర్డర్‌పై స్టే జారీ చేసింది. తమిళనాడు సర్కార్ కూడా థియేటర్ల వద్ద సెక్యూర్టీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది.సినిమాకు సీబీఎఫ్‌సీ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వమే శాంతి, భద్రత సమస్యల్ని చూసుకోవాలని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. ద కేరళ స్టోరీ చిత్రాన్ని బ్యాన్ చేస్తున్నట్లు మే 8వ తేదీన పశ్చిమ బెంగాల్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)