Fact Check: స్మశానాల్లో అంతిమ సంస్కారాలపై 18 శాతం GST వార్తలను ఖండించిన కేంద్ర ప్రభుత్వం, స్మశానంలో సేవలపై పన్ను లేదని స్పష్టీకరణ, కేవలం స్మశానాల నిర్మాణంలో పాల్గొనే కాంట్రాక్టులపై మాత్రమే 18 శాతం జీఎస్టీ ఉందని ప్రకటన..

ఈ మేరకు PIB తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో అంతిమ సంస్కారాలపై జీఎస్టీ వసూలు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ప్రకటించారు.

GST Revenue Collection - Representational Image. | (Photo Credits: PTI/File)

స్మశానాల్లో దహన సంస్కారాలపై 18 శాతం జీఎస్టీ విధించినట్లు వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ మేరకు PIB తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో అంతిమ సంస్కారాలపై జీఎస్టీ వసూలు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ప్రకటించారు. అంత్యక్రియలు, ఖననం, శ్మశానవాటిక లేదా మార్చురీ సేవలపై ఎలాంటి GST లేదని స్పష్టం చేసింది. అయితే ఈ 18 శాతం GST స్మశాన వాటికల నిర్మాణ ఒప్పందాలకు మాత్రమే వర్తిస్తుందని, స్మశానంలో లభించే సేవలకు కాదని స్పష్టం చేసింది.



సంబంధిత వార్తలు