Bihar CM Nitish Kumar: మద్యం తాగే వాళ్లు భారతీయులే కాదు, వారంతా మహా పాపులు, అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్

మద్యం తాగే వాళ్లు అసలు భారతీయులే కాదని వారంతా మహా పాపులు అని బీహార్ సీఎం నితీష్ కుమార్ (Bihar CM Nitish Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ‍్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.బీహార్‌లో మద్యపాన నిషేధం కొనసాగుతున్న విషయం విదితమే.

Bihar CM Nitish Kumar (photo-ANI)

మద్యం తాగే వాళ్లు అసలు భారతీయులే కాదని వారంతా మహా పాపులు అని బీహార్ సీఎం నితీష్ కుమార్ (Bihar CM Nitish Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ‍్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.బీహార్‌లో మద్యపాన నిషేధం కొనసాగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగానే బీహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు- 2022ను కఠినతరం చేస్తూ సవరణలు చేశారు. ఈ బిల్లు గవర్నర్ ఆమోదం పొందింది. తాజాగా ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగుతుండగా..మద్యం సేవించే వారు అసలు భారతీయులే కాదన్నారు. మందు తాగే వారందరూ మహా పాపులు అంటూ అసెంబ్లీలో సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మహాత్మా గాంధీ కూడా మద్యపానాన్ని వ్యతిరేకించారని అన్నారు. ఆయన సిద్ధాంతాలకు విరుద్ధంగా మద్యం సేవించే వారిని తాను భారతీయులుగా పరిగణించను అని వ్యాఖ్యానించారు.ఈ బిల్లు ప్రకారం.. ఎవరైనా మద్యం సేవించి మొదటిసారి పట్టుబడితే జరిమానాతో పాటుగా ఒక నెల జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది. కాగా, జరిమానా డిపాజిట్‌ చేసి బెయిల్‌ పొందే అవకాశం కల్పించారు. మరోవైపు.. బీహార్‌లో 14-15 మంది పాట్నా హైకోర్టు న్యాయమూర్తులు బీహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చట్టం కింద చేసిన అరెస్టులకు సంబంధించిన బెయిల్ పిటిషన్‌లను మాత్రమే విచారించడంతో బీహార్‌లోని న్యాయవ్యవస్థ పనితీరుపై మద్యం చట్టం ప్రభావం చూపుతోందని సుప్రీంకోర్టు గత ఏడాది వ్యాఖ్యానించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now