Telangana: తెలంగాణలో రోడ్డు మీద వేలాది కీటకాలు, కరీంనగర్-హైదరాబాద్ రాజీవ్ రహదారిపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న వాహనదారులు, కీటకాల నమూనాలను సేకరించినట్లు తెలిపిన వ్యవసాయ అధికారి వి శ్రీధర్

గత రెండు రోజులుగా తెలంగాణ కరీంనగర్-హైదరాబాద్ రాజీవ్ రహదారిపై వేలాది కీటకాలు తిరుగుతున్నాయి. కరీంనగర్ శివార్లలోని కాకతీయ కాలువ గుండా వెళుతున్న వాహనదారులు caddisfliesతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. వారిని ఈ caddisflies అటాక్ చేస్తున్నాయి. వేల సంఖ్యలో అవి చీకటిలో తిరుగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

caddisflies (Photo-Wiki)

జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఆ స్థలాన్ని పరిశీలించిన కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి వి శ్రీధర్ మీడియాకు మాట్లాడుతూ, ఆ ప్రదేశం నుండి కీటకాల నమూనాలను సేకరించినట్లు చెప్పారు. "కాడిస్ఫ్లైస్ నీటి వనరులు లేదా నిశ్చలమైన నీరు దొరికిన ప్రదేశాల దగ్గర కనిపిస్తాయి. పర్యావరణ అసమతుల్యత కారణంగా కొన్ని జాతులు కూడా చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. కనుక ఇది కూడా ఒక కారణం కావచ్చు. కాడిస్ఫ్లైస్ సమూహంగా వస్తాయి అలాగే కాంతికి ఆకర్షితులవుతాయి, ”అని శ్రీధర్ అన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement