Thug Life Teaser: థగ్‌లైఫ్‌ టీజర్ వచ్చేసింది, దాదాపు 37 సంవత్సరాల తరువాత మళ్లీ కలిసిన కమల్‌హాసన్‌, మణిరత్నం కాంబినేషన్‌

కమల్‌హాసన్‌, మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'థగ్‌లైఫ్‌'. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శింబుతో పాటు పలువురు ప్రముఖ తారలు నటిస్తున్నారు. నేడు (నవంబరు 7) కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ 'థగ్‌లైఫ్‌' టీజర్‌ను విడుదల చేసారు. ఈ టీజర్‌లోనే చిత్రాన్ని 2025 జూన్ 5న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు.

Thug Life Release Date Teaser

అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారన్న పిటిషన్‌ను క్వాష్ చేస్తూ హైకోర్టు తీర్పు, వ్యక్తిగత పర్యటన కోడ్ ఉల్లంఘన కిందకు రాదన్న న్యాయస్థానం

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్‌, రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్‌పై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్ & శివ అనంత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ ఈ సినిమాని సమర్పిస్తోంది. ఇక ఈ ఇద్దరి కలయికలో రూపొందిన నాయకన్‌ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టైమ్‌ మ్యాగజైన్‌ ప్రపంచ సినిమాల్లో ఆల్‌ టైమ్‌ క్లాసిక్స్‌ జాబితాలో ఉన్న ఏకైక భారతీయ చిత్రంగా నాయకన్‌కు ఓ పత్యేకత ఉంది. మళ్లీ దాదాపు 37 సంవత్సరాల విరామం తరువాత ఈ సెన్సేషన్‌ జోడీ 'థగ్‌లైఫ్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Thug Life Release Date Teaser 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement