Tragedy at Bus Stop: వీడియో ఇదిగో, బస్టాండులో ప్రయాణికుల మీదకి దూసుకెళ్లిన బస్సు, నాలుగేళ్ల బాలుడు మృతి, పలువురికి గాయాలు, నాసిక్ ప్రాంతంలోని సిన్నార్ బస్టాండులో ఘటన
మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం సిన్నార్ బస్టాండులో ఘోర విషాదం చోటుచేసుకుంది. బస్టాండ్‌లోని ప్లాట్‌ఫామ్‌పై నిల్చొని బస్సు కోసం వేచిచూస్తున్న ప్రయాణికులపైకి ఒక బస్సు అకస్మాత్తుగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం సిన్నార్ బస్టాండులో ఘోర విషాదం చోటుచేసుకుంది. బస్టాండ్‌లోని ప్లాట్‌ఫామ్‌పై నిల్చొని బస్సు కోసం వేచిచూస్తున్న ప్రయాణికులపైకి ఒక బస్సు అకస్మాత్తుగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం నేరుగా ప్లాట్‌ఫామ్‌పైకి ఎక్కి ప్రయాణికులను ఢీకొట్టింది. బస్సు వేగం ఎక్కువగా ఉండటంతో ప్లాట్‌ఫామ్‌పై ఉన్నవారికి తప్పించుకునే వీలు లేకపోయింది. ప్రమాద స్థలంలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. గాయపడిన ప్రయాణికులను అక్కడే ఉన్న ఆర్టీసీ సిబ్బంది వెంటనే స్పందించి సమీప ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.చిన్నారి మృతి స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని బస్సును స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా లేదా బస్సు సాంకేతిక లోపమేనా అన్నది పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో బస్టాండ్ పరిసరాల్లో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Bus Runs Over Passengers in Nasik
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)