Tripura By-Polls: కాంగ్రెస్ నేతపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి, తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్న త్రిపుర కాంగ్రెస్‌ అభ్యర్థి సుదీప్‌ రాయ్‌ బర్మాన్‌

ఉప ఎన్నికల వేళ త్రిపురలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి సుదీప్‌ రాయ్‌ బర్మాన్‌పై ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నారు.

Sudip Roy Barman (Photo Credits: ANI)

ఉప ఎన్నికల వేళ త్రిపురలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి సుదీప్‌ రాయ్‌ బర్మాన్‌పై ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నారు. ఈ నెల 23వ తేదీన త్రిపురలో రాజధాని అగర్తాల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సుదీప్‌ బర్మాన్‌.. ఆదివారం రాత్రి ఉజన్ అభోయ్‌నగర్‌లో తన మద్దతుదారులను కలిశారు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. అనంతరం కారు, కాంగ్రెస్‌ పార్టీ జెండాలను ధ్వంసం చేశారు. కాగా, ఈ దాడికి అధికార బీజేపీ పార్టీనే కారణమని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

సుదీప్‌ రాయ్‌ బర్మాన్‌ ఈ ఏడాది ప్రారంభంలో బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బీజేపీ సర్కార్‌ పాలనలో ఆయన ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను పార్టీ అధిష్టానం మంత్రి పదవి నుంచి తొలగించింది. దీంతో గత ఫిబ్రవరి నెలలో బర్మాన్‌ బీజేపీకి గుడ్‌ బై చెప్పి.. కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఇక, త్రిపురలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు జూన్ 23న ఉప ఎన్నికలు జరుగుతుండగా.. జూన్ 26న ఓట్ల లెక్కింపు జరగనుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం

Advertisement
Advertisement
Share Now
Advertisement