Hori Habba Bull Race Tragedy: ఎడ్ల రేసులో తీవ్ర విషాదం, హోరీ హబ్బా ఈవెంట్‌లో ఇద్దరు వ్యక్తులు మృతి, ఎడ్ల రేసులు నిర్వహించేందుకు నిర్వాహకులు అనుమతి తీసుకోలేదని తెలిపిన పోలీసులు

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జరిగిన ఎడ్ల రేసులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెండు వేర్వేరు హోరీ హబ్బా అనే ఎడ్ల రేసులో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. శివమొగ్గ జిల్లాలోని షికారిపుర, జాడే గ్రామంలో ఈ ఘటనలు జరిగాయి.

Representational Image (Photo Credits: Twitter)

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జరిగిన ఎడ్ల రేసులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెండు వేర్వేరు హోరీ హబ్బా అనే ఎడ్ల రేసులో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. శివమొగ్గ జిల్లాలోని షికారిపుర, జాడే గ్రామంలో ఈ ఘటనలు జరిగాయి. మృతులు షికారిపురకు చెందిన ప్రశాంత్, సొరబా తాలూకాలోని జాడే గ్రామానికి చెందిన ఆదిగా గుర్తించారు.దీపావళి తర్వాత జరిపే హోరీ హబ్బా ఈవెంట్‌లో భాగంగా ఎడ్ల పందేలు నిర్వహిస్తారు.

అయితే ఎడ్ల రేసులు నిర్వహించేందుకు నిర్వాహకులు అనుమతి తీసుకోలేదని శివమొగ్గ ఎస్పీ మిథున్ కుమార్ చెప్పారు. రెండు సంఘటనల గురించి పోలీసులకు ఎటువంటి సమాచారం లేదన్నారు. ఈ విషయంపై విచారణ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటారని కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర అన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now