Union Budget 2024: బడ్జెట్ సమగ్ర స్వరూపం ఇదే, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు, అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు
కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇవాళ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్మలమ్మ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇక కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ముఖ్యంగా 9 ప్రధాన అంశాలను ఆధారంగా చేసుకుని రూపొందించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కొత్త పన్ను విధానం ఎంచుకున్న ఉద్యోగులకు అలర్ట్, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000 కుపెంచుతున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటన
కేంద్ర వార్షిక బడ్జెట్ రూ.48.21 లక్షల కోట్లు
ప్రభుత్వానికి సమకూరే మొత్తం ఆదాయం (అంచనా) రూ.32.07 లక్షల కోట్లు
ఇందులో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు
అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు (అంచనా)
ద్రవ్యలోటు 4.9 శాతంగా (అంచనా)
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)