Jamili Elections: జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ అమోదం, త్వరలో పార్లమెంట్ ముందుకు రానున్న బిల్లు, అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు
జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ అమోదం తెలిపింది. కేబినెట్ అమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే ఈ బిల్లు పార్లమెంట్ ముందుకురానుంది.ఈ బిల్లు అమోదంలోకి వస్తే తొలి దశలో పార్లమెంటు,
జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ అమోదం తెలిపింది. కేబినెట్ అమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే ఈ బిల్లు పార్లమెంట్ ముందుకురానుంది.ఈ బిల్లు అమోదంలోకి వస్తే తొలి దశలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు.. అవిపూర్తైన వందరోజుల్లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. దీనికోసం దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితాను ఉపయోగించబోతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356, ఆర్టికల్ 324, ఆర్టికల్ 83(2), ఆర్టికల్ 172(1), ఆర్టికల్ 83కు సంబంధించి పలు సవరణలు చేయనున్నారు.
ఈ బిల్లు అమోదం పొందాలంటే 543 స్థానాలున్న లోక్‌సభలో కనీసం 67 శాతం అంటే.. 362 ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటువేయాలి. దీంతోపాటు రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం అంటే 164 మంది సభ్యులు ఈ బిల్లును సమర్థించాలి. అలాగే 14 రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. రాజమండ్రి నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం, తొలి నాన్‌స్టాప్ విమానానికి వాటర్ కేనన్స్‌తో సిబ్బంది స్వాగతం
Union Cabinet has approved 'One Nation One Election' Bill
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)