US Elections Results 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి నేత రాజా కృష్ణమూర్తి ఘన విజయం, ఇల్లినోయీ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి నేతలు పలువురు వివిధ రాష్ట్రాల్లో పోటీ పడిన విషయం తెలిసిందే. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో రాజా కృష్ణమూర్తి విజయం సాధించారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన రాజా కృష్ణమూర్తి.. ఇల్లినోయీ నుంచి ప్రతినిధుల సభకు పోటీ పడ్డారు. రాష్ట్రంలోని ఎనిమిదో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన విజయం సాధించారు. మరోవైపు, నార్తర్న్ వర్జీనియాలో సుహాస్ సుబ్రహ్మణ్యం గెలుపొందారు. సుహాస్ కూడా డెమోక్రటిక్ పార్టీ తరఫునే ఎన్నికల బరిలో నిలిచారు. నార్తర్న్ వర్జీనియా పదో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి సుహాస్ విజయం సాధించారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)