Uttar Pradesh: భార్యతో తోటి జవాన్ అక్రమ సంబంధం, కోపంతో అతని భార్యను కత్తితో దాడి చేసి చంపిన మరో జవాన్, యూపీలో దారుణ ఘటన

ఆర్మీ జవాన్ మనోజ్ సేనాపతితో తన భార్యకు వివాహేతర సంబంధం ఉన్నట్లు మరో ఆర్మీ జవాన్‌ నితీశ్‌ పాండే గ్రహించాడు.

Murder (Photo Credits: Pixabay)

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో భార్యతో వివాహేతర సంబంధం ఉన్న సహోద్యోగిని ఒక ఆర్మీ జవాన్‌ (Army jawan) కత్తితో దాడి చేసి చంపాడు. ఆర్మీ జవాన్ మనోజ్ సేనాపతితో తన భార్యకు వివాహేతర సంబంధం ఉన్నట్లు మరో ఆర్మీ జవాన్‌ నితీశ్‌ పాండే గ్రహించాడు. ఈ నెల 13న ఆ జవాన్‌ ఇంటికి వెళ్లి ఈ విషయంపై అతనిా భార్యతో గొడవపడ్డాడు. ఈ గొడవ పెద్దది కావడంతో తన వెంట తెచ్చిన సైనికులు వినియోగించే కత్తితో ఆమెపై దాడి చేశాడు. మెడ, ఇతర శరీర భాగాలపై కత్తి గాయాలు కావడంతో ఆమె మరణించింది.మిలటరీ పోలీసుల సహాయంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడు దాచిన హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)