Uttar Pradesh: యూపీలో బీజేపీ నేత ఇంటిని బుల్‌డోజర్లతో కూల్చివేసిన అధికారులు, మహిళను దూషించారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న బీజేపీ కార్యకర్త శ్రీకాంత్‌ త్యాగి

ఉత్తర్‌ప్రదేశ్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.మహిళను దూషించారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న బీజేపీ కార్యకర్త శ్రీకాంత్‌ త్యాగి ఇంటి వద్ద అక్రమ నిర్మాణాన్ని బుల్‌డోజర్లతో కూల్చివేశారు నోయిడా అధికారులు.

Bulldozers at Shrikant Tyagi's Home. (Photo Credits: ANI)

ఉత్తర్‌ప్రదేశ్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.మహిళను దూషించారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న బీజేపీ కార్యకర్త శ్రీకాంత్‌ త్యాగి ఇంటి వద్ద అక్రమ నిర్మాణాన్ని బుల్‌డోజర్లతో కూల్చివేశారు నోయిడా అధికారులు. నోయిడా సెక్టార్ 93లోని గ్రాండ్‌ ఒమాక్సీ హౌసింగ్‌ సొసైటీలో ఉన్న ఈ ఇంటికి సోమవారం ఉదయం పోలీసు బృందాలతో వెళ్లారు. అనంతరం త్యాగి ఇంటి ముందు భాగాన్ని కూలగొట్టారు.కాగా యూపీలోని నోయిడా హౌజింగ్ సొసైటీలో ఓ మ‌హిళ‌పై స్థానిక బీజేపీ కార్య‌క‌ర్త త్యాగి అనుచితంగా వ్య‌వ‌హించాడు. ఆమెను దూషించి దాడి చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ ఘ‌ట‌న‌లో ఐపీసీ కింద కేసు బుక్కైంది. ప్ర‌స్తుతం శ్రీకాంత్ త్యాగి ప‌రారీలో ఉన్నాడు. త్యాగిపై గ్యాంగ్‌స్ట‌ర్ చ‌ట్టం కింద కేసు బుక్ చేశారు.