Uttar Pradesh: వీడియో ఇదిగో, క్రేన్ నుంచి పట్టుజారి బైక్‌పై వెళ్తున్న పోలీస్ మీద పడిన దిమ్మె, అక్కడికక్కడే మృతి
బైక్‌పై వెళ్తున్న పోలీస్‌పై ఆ దిమ్మ పడింది. దీంతో దాని కింద నలిగి అతడు మరణించాడు. (Girder Falls, Cop Crushed To Death) బైక్ వెనుక కూర్చొన్న మరో పోలీస్ తీవ్రంగా గాయపడ్డాడు. నకహా రైల్వే క్రాసింగ్ వద్ద ఓవర్‌బ్రిడ్జి నిర్మిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న ఓవర్‌బ్రిడ్జికి చెందిన బరువైన దిమ్మ క్రేన్ నుంచి పడింది. బైక్‌పై వెళ్తున్న పోలీస్‌పై ఆ దిమ్మ పడింది. దీంతో దాని కింద నలిగి అతడు మరణించాడు. (Girder Falls, Cop Crushed To Death) బైక్ వెనుక కూర్చొన్న మరో పోలీస్ తీవ్రంగా గాయపడ్డాడు. నకహా రైల్వే క్రాసింగ్ వద్ద ఓవర్‌బ్రిడ్జి నిర్మిస్తున్నారు. గురువారం ఉదయం 10 క్వింటాళ్ల బరువైన అల్యూమినియం గిడ్డర్‌ను క్రేన్ సహాయంతో వంతెనపైకి చేర్చేందుకు ప్రయత్నించారు.క్రేన్ గొలుసులు తెగడంతో బైక్‌పై వెళ్తున్న పోలీస్‌పై ఆ దిమ్మ పడింది. దీంతో దాని కింద నలిగి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన 45 ఏళ్ల విజేంద్ర సింగ్‌గా మృతుడ్ని గుర్తించారు. బైక్ వెనుక కూర్చొన్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ మానాయే కుందు తీవ్రంగా గాయపడ్డాడు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
Cop Crushed To Death As Girder From Under-Construction Overbridge Falls On Moving Bike
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)