UP Shocker: యూపీలో దారుణం, మాజీ భార్య చేతులు కట్టేసి నాల్గో అంతస్తు నుంచి కిందకు తోసి చంపేశారు, సీసీటీవీ పుటేజీ వీడియో వైరల్

ఆమె ఘజియాబాద్‌ నివాసి. ఫిరోజాబాద్‌ నివాసి అయిన ఆకాశ్‌ గౌతమ్‌ని 2014లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకే 2018లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వారు వేరువేరుగా ఉంటున్నారు.

Representational Image | (Photo Credits: PTI)

ఆగ్రాలోని నాగ్లా మేవతిలోని అపార్ట్‌మెంట్‌లో రితికా సింగ్‌ ఆనే వివాహిత హత్యకు గురైంది. ఆమె ఘజియాబాద్‌ నివాసి. ఫిరోజాబాద్‌ నివాసి అయిన ఆకాశ్‌ గౌతమ్‌ని 2014లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకే 2018లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వారు వేరువేరుగా ఉంటున్నారు. ఈ మేరకు రితికా సింగ్‌ తన ఫేస్‌బుక్‌ స్నేహితుడు విపుల్‌ అగర్వాల్‌తో నాగ్లామేవతి అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటుంది. ఇందిలా ఉండగా ఆమె మాజీ భర్త, మరో ఇద్దరు మహిళలు కలిసి ఆమె నివాసం వద్దకు వచ్చి దాడి చేసేందుకు యత్నించారు .

ఈ హఠాత్పరిణామానికి ఒక్కసారిగా షాక్‌ అయ్యింది రితికా. వారంతా రితికా ప్రియుడి పై కూడా దాడి చేశారు. ఆ తర్వాత వారు రితికా చేతులు కట్టేసి నాల్గో అంతస్తు నుంచి కిందకు తోసి చంపేశారు. ఈ మేరకు రితికా స్నేహితుడు విపుల్‌ అగర్వాల్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఐతే ఈ కేసుకి సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశామని, ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)