Uttar Pradesh Shocker: పెళ్లివేడుకలో స్నేహితుడిని తుఫాకితో కాల్చివేసిన వరుడు, గాల్లోకి కాల్పులు జరపుతుండగా మిస్ ఫైరింగ్, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఉత్తరప్రదేశ్ సోన్‌భంద్రా జిల్లాలోని బ్రహ్మనగర్ ఏరియాలో ఓ పెళ్లి వేడుకలో విషాదఛాయలు అలుముకున్నాయి. బరాత్ వేడుకలో భాగంగా ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లికుమారుడు గాల్లోకి కాల్పులు జరిపాడు. ప్రమాదవశాత్తు ఆ బుల్లెట్ స్నేహితుడికి తగిలింది
ఉత్తరప్రదేశ్ సోన్‌భంద్రా జిల్లాలోని బ్రహ్మనగర్ ఏరియాలో ఓ పెళ్లి వేడుకలో విషాదఛాయలు అలుముకున్నాయి. బరాత్ వేడుకలో భాగంగా ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లికుమారుడు గాల్లోకి కాల్పులు జరిపాడు. ప్రమాదవశాత్తు ఆ బుల్లెట్ స్నేహితుడికి తగిలింది. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. మనీష్ మాద్హేశియా అనే పెళ్లి కుమారుడు తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి బరాత్ వేడుకలో భాగంగా ఊరేగింపుగా వెళ్తున్నాడు. ఈ సమయంలో మనీష్ గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆ బుల్లెట్ పెళ్లికుమారుడు స్నేహితుడు బాబు లాల్ యాదవ్‌కు తగిలింది. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ యాదవ్ ప్రాణాలు కోల్పోయాడు. వరుడు ఉపయోగించిన తుపాకీ కూడా యాదవ్‌దే. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరుడిని అదుపులోకి తీసుకున్నారు. తుపాకీని కూడా పోలీసులు సీజ్ చేశారు.