Kota Suicides: కోటాలో మళ్లీ ఇంకో విద్యార్థి ఆత్మహత్య, తాజా మరణంతో ఈ ఏడాది 26కి చేరిన విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య
రాజస్థాన్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజస్థాన్ కోటాకు వచ్చిన విద్యార్థి నీట్ పరీక్షల కోసం సొంతంగానే సన్నద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో కోటాలో ఆత్మహత్య చేసుకున్నాడు. తాజా మరణంతో ఈ ఏడాది 26 కేసులు కావడం గమనార్హం.
కేటాలో నీట్ సంబంధిత విద్యార్థుల మరణాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. ఈ మరణాలను అరికట్టడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏ మాత్రం తగ్గడం లేదు. విద్యార్థులు నివసించే హాస్టళ్లకు జాలీలు కట్టడం, హ్యాంగింగ్ ఫ్యాన్లను వాడటం వంటి చర్యలు చేపట్టారు. విద్యార్థుల మానసిక స్థితిని మెరుకుపరచడానికి ప్రత్యేక తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. అయినా విద్యార్థుల ఆత్మహత్యలు ఏ మాత్రం తగ్గడం లేదు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)