Uttar Pradesh: యూపీలో దారుణం, మహిళలపై లాఠీ ఝళిపించిన పోలీసులు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
మహిళలను లాఠీలతో కొడుతూ చెదరగొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో అంబేద్కర్ నగర్ జిల్లా జలాల్‌పూర్‌లో చోటు చేసుకుంది.
యూపీ పోలీసులు ఒక మహిళా సముహంపై లాఠీ ఝళిపించారు. మహిళలను లాఠీలతో కొడుతూ చెదరగొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో అంబేద్కర్ నగర్ జిల్లా జలాల్‌పూర్‌లో చోటు చేసుకుంది. మహిళలు పోలీసుల వాహనాలపై రాళ్ల రువ్వడంతో వారిని చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా ఇలా చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
ఇటీవల ఆ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై మహిళలు నిరసన వ్యక్తం చేశారు. మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై పలు విమర్శలు తలెత్తాయి. ఐతే పోలీసులు మాత్రం పరిస్థితి అదుపు తీసుకురావడానికి ఇలా బలగాలను రంగంలోకి దింపి లాఠీ ఝళిపించాల్సి వచ్చిందని చెబుతున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)