Uttarakhand Floods: కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండ చరియలు, 12 మంది గల్లంతు, హుటాహుటిన సహాయక చర్యలు ప్రారంభించిన అధికారులు
దేవ భూమి ఉత్తరాఖండ్ కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో కొండచరియ విరిగిపడటంతో పెను ప్రమాదం సంభవించింది. రుద్ర ప్రయాగ్ జిల్లా, గౌరీ కుండ్ సమీపంలో ఈ కొండచరియ క్రింద దాదాపు 12 మంది చిక్కుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మార్గంలోని దుకాణాలు ధ్వంసమయ్యాయి
దేవ భూమి ఉత్తరాఖండ్ కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో కొండచరియ విరిగిపడటంతో పెను ప్రమాదం సంభవించింది. రుద్ర ప్రయాగ్ జిల్లా, గౌరీ కుండ్ సమీపంలో ఈ కొండచరియ క్రింద దాదాపు 12 మంది చిక్కుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మార్గంలోని దుకాణాలు ధ్వంసమయ్యాయి. రాష్ట్ర విపత్తు స్పందన దళం హుటాహుటిన చేరుకుని, సహాయ కార్యక్రమాలను ప్రారంభించింది.
వీరిలో కొందరు కొట్టుకుపోయి ఉండవచ్చునని కూడా తెలిపారు. గురువారం రాత్రి భారీ వర్షాలు కురియడంతో ఈ కొండచరియ విరిగిపడిందని తెలిపారు. మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయని రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. తప్పిపోయినవారిని గుర్తించేందుకు గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయని జిల్లా ఎస్‌పీ డాక్టర్ విశాఖ తెలిపారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్ దలీప్ సింగ్ రాజ్వర్ మాట్లాడుతూ, భారీ వర్షాలు, రాళ్లు విరిగిపడటం వల్ల మూడు దుకాణాలు ధ్వంసమైనట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)