Uttarakhand: సైనికులకి సలాం సలాం.. సబ్ జీరో ఉష్ణోగ్రత వద్ద తాళ్లు పట్టుకుని జవాన్లు పెట్రోలింగ్, మోకాలి లోతు మంచు నుంచి కాళ్లను లాక్కుంటూ పహారా, వీడియో షేర్ చేసిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బంది
సబ్ జీరో ఉష్ణోగ్రతలలో మంచుతో కప్పబడిన ప్రాంతంలో ITBP సైనికులు పహారా కాస్తున్నారు.
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సిబ్బంది ఉత్తరాఖండ్ హిమాలయాల చుట్టూ 15,000 అడుగుల వద్ద మంచుతో కప్పబడిన ప్రాంతంలోపెట్రోలింగ్ నిర్వహిస్తున్న వీడియో బయటకు వచ్చింది. సబ్ జీరో ఉష్ణోగ్రతలలో మంచుతో కప్పబడిన ప్రాంతంలో ITBP సైనికులు పహారా కాస్తున్నారు. గత వారం, ITBP ఉత్తరాఖండ్‌లోని సరిహద్దు సమీపంలో సైనికులు చల్లటి వాతావరణంలో శిక్షణ పొందుతున్న వీడియోను పంచుకున్నారు.
ITBP సిబ్బంది లేదా 'హిమ్‌వీర్లు' తమ ఆయుధాలను పట్టుకుని మైనస్ 25 డిగ్రీల సెల్సియస్ వద్ద మోకాలి లోతు మంచులో నిలబడి భౌతిక డ్రిల్‌లో పాల్గొంటున్నట్లు వీడియో చూపించింది. గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌లోని ఎత్తైన ప్రాంతాలలో మంచు కురుస్తుంది, అనేక ప్రాంతాలను తెల్లటి మందపాటి పొరతో కప్పింది, ఈ ప్రాంతాలలో గస్తీ నిర్వహించడం సైనికులకు సవాలుగా మారింది.ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు వాయువ్య భారతదేశంలోని మైదానాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తన తాజా బులెటిన్‌లో తెలిపింది. ఈ నేపథ్యంలోనే సైనికులు తక్కువ ఉష్ణోగ్రతలలో మంచుతో కప్పబడిన ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్నారు.