Uttarakhand Transformer Blast: ఘోర ప్రమాదం, అలకనంద నది వద్ద ట్రాన్స్‌ఫారమ్ పేలి 11 మంది మృతి, 14 మందికి తీవ్ర గాయాలు
అలకనంద నది ( Alaknanda River) చమోలి డ్యామ్ దగ్గర ట్రాన్స్‌ఫారమ్ పేలిన ఘటనలో 10 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మృతుల్లో పోలీసు సిబ్బంది.. ముగ్గురు హోంగార్డులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంటున్నారు.
ఉత్తరాఖండ్‌లో బుధవారం ఘోరం ప్రమాదం జరిగింది. అలకనంద నది ( Alaknanda River) చమోలి డ్యామ్ దగ్గర ట్రాన్స్‌ఫారమ్ పేలిన ఘటనలో 10 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మృతుల్లో పోలీసు సిబ్బంది.. ముగ్గురు హోంగార్డులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంటున్నారు.
ట్రాన్స్‌ఫార్మర్ పేలి.. బ్రిడ్జి గుండా కరెంట్ పాస్ అయ్యింది. ఆ సమయంలో బ్రిడ్జిపై ఉన్నవాళ్లకు కరెంట్ షాక్ తగిలింది. కొందరు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడగా.. వాళ్లను చికిత్స కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్పీ పరమేంద్ర దోవల్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. నమామి గంగా ప్రాజెక్టులో భాగంగా అలకనంద నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు.
ANI Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)