Wrestlers Protest: 45 రోజుల్లో WFIకి ఎన్నికలు నిర్వహించాలి, లేకుంటే భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్‌ చేస్తామని వార్నింగ్ ఇచ్చిన అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ

అటుగా మార్చ్‌ చేపట్టిన రెజ్లర్లను నిర్బంధించడాన్ని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. అలాగే రెజ్లింగ్ సమాఖ్యకు 45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించకపోతే.. భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్‌ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Wrestlers Protesting (Credits - IANS)

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు చేస్తోన్న ఆందోళనపై అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ స్పందించింది. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం వేళ.. అటుగా మార్చ్‌ చేపట్టిన రెజ్లర్లను నిర్బంధించడాన్ని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. అలాగే రెజ్లింగ్ సమాఖ్యకు 45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించకపోతే.. భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్‌ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.

పతకాలను గంగలో కలిపేందుకు హరిద్వార్ చేరుకోగా పోలీసులు అడ్డుకోవడంతో సుమారు 20 నిమిషాలపాటు పాటు మౌన దీక్ష చేశారు. చివరి క్షణంలో ఖాప్‌, రైతు సంఘాల నేతలు వారిని వారించారు. కేంద్ర ప్రభుత్వానికి కొంత గడువిద్దామని ప్రతిపాదించారు. దాంతో ప్రభుత్వానికి ఐదు రోజుల గడువిస్తున్నామని, అప్పటిలోగా చర్యలు తీసుకోకుంటే పతకాలు గంగలో కలిపేస్తామని స్పష్టం చేశారు.

Subhashini Ali Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)