Vande Bharat Express Train: రెండు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ, ముంబై- షోలాపూర్, ముంబై -సాయినగర్ షిర్డీ మధ్య పరుగులు పెట్టనున్న వందేబారత్ ట్రైన్

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుండి రెండు కొత్త వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు.

PM Narendra Modi flags-off Mumbai-Solapur Vande Bharat Express train. (Photo credits: Twitter/ANI)

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుండి రెండు కొత్త వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ యొక్క కొత్త, అప్‌గ్రేడ్ వెర్షన్ ముంబై- షోలాపూర్, ముంబై -సాయినగర్ షిర్డీ మధ్య నడుస్తుంది.

ముంబై-సోలాపూర్ రైలు, తొమ్మిదవ వందే భారత్ రైలు దేశ వాణిజ్య రాజధానిని మహారాష్ట్రలోని టెక్స్‌టైల్స్, హుతాత్మా నగరానికి కలుపుతుంది. షోలాపూర్‌లోని సిద్ధేశ్వర్, అక్కల్‌కోట్, తుల్జాపూర్, షోలాపూర్ సమీపంలోని పంధర్‌పూర్, పూణే సమీపంలోని అలంది వంటి పుణ్యక్షేత్రాలకు వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది.

Here's ANI Tweets

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement