PM Modi on Article 370 Verdict: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ప్రధాని మోదీ, భారతీయులుగా మనమెంతో గర్వపడే ఐక్యత అంటూ..
ఇది ప్రజల ఐక్యత, ఆశలు, పురోగతిని ప్రతిధ్వనించే చారిత్రక తీర్పు అని కొనియాడారు. రానున్న తరాలకు ఇదో ఆశాకిరణం. ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానం. బలమైన ఐక్యభారతాన్ని నిర్మించాలనే మన సంకల్పానికి నిదర్శనం’’ అని మోదీ (PM Modi) ఆనందం వ్యక్తం చేశారు.
SC on Article 370 Verdict: జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ‘ఆర్టికల్ 370 (Article 370)’ రద్దు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం కీలక తీర్పు (Article 370 Verdict)వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.
ఈ తీర్పుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) హర్షం వ్యక్తం చేశారు.ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు నేడు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం. ఇది ప్రజల ఐక్యత, ఆశలు, పురోగతిని ప్రతిధ్వనించే చారిత్రక తీర్పు అని కొనియాడారు. రానున్న తరాలకు ఇదో ఆశాకిరణం. ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానం. బలమైన ఐక్యభారతాన్ని నిర్మించాలనే మన సంకల్పానికి నిదర్శనం’’ అని మోదీ (PM Modi) ఆనందం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 అంశంపై మూడు తీర్పులను వెలువరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, 2024 సెప్టెంబరు 30వ తేదీలోగా జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరపాలని ఆదేశం
Here's PM Modi Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)