Video: వీడియో ఇదిగో, పిల్లల కళ్లముందే రాకాసి అలల్లో కొట్టుకుపోయిన తల్లి, ముంబైలోని బాంద్రా ఫోర్టులో విషాదకర ఘటన
పిల్లల కళ్ల ముందే ఓ తల్లి అలలకు కొట్టుకుపోయింది. ముంబైలోని రబలేకు చెందిన ముకేశ్, జ్యోతి సోనార్ దంపతులు కలిసి తమ పిల్లలతో గత ఆదివారం జుహు చౌపట్టికి వెళ్లారు.
family picnic turned into a tragedy: ముంబైలోని బాంద్రా ఫోర్టులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పిల్లల కళ్ల ముందే ఓ తల్లి అలలకు కొట్టుకుపోయింది. ముంబైలోని రబలేకు చెందిన ముకేశ్, జ్యోతి సోనార్ దంపతులు కలిసి తమ పిల్లలతో గత ఆదివారం జుహు చౌపట్టికి వెళ్లారు. అక్కడ అలల ఉధృతి అధికంగా ఉండటంతో బీచ్‌లోకి అధికారులు అనుమతించలేదు. దీంతో వారు బాంద్రా ఫోర్టుకు చేరుకున్నారు. ఇక భార్యాభర్తలిద్దరూ సరదాగా అలలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
రాళ్లపై కూర్చున్న దంపతులను రాకాసి అలలు సముద్రంలోకి లాగేసుకున్నాయి. భార్యను కాపాడేందుకు ఆమె చీర పట్టుకుని లాగాడు ముకేశ్. కానీ ఆమె అలల ధాటికి కొట్టుకుపోయింది. ముకేశ్‌ను స్థానికులు కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గాలింపులు చేపట్టగా, ఆమె మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది.తల్లి జ్యోతి అలల ధాటికి కొట్టుకుపోతున్న సమయంలో వారికి సమీపంలో ఉన్న పిల్లలు మమ్మీ మమ్మీ అంటూ అరిచారు. తమ కళ్ల ముందే తల్లి సముద్రంలోకి కొట్టుకుపోవడాన్ని చూసి ఆ పిల్లలు తల్లడిల్లిపోయారు. వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)