Yamuna Waters Reach Taj Mahal Walls: గడచిన 45 ఏళ్లలో తొలిసారిగా తాజ్‌ మహల్‌‌ని తాకిన యమునా నది, వీడియో ఇదిగో..

తాజ్‌మహల్ గోడల్లో, గార్డెన్‌లో భారీగా వరదనీరు నిలిచింది. ఆదివారం రాత్రి తాజ్‌మహల్ దగ్గర యమునా నది వరద గరిష్ఠ స్థాయి అయిన 495 అడుగులను దాటి 497.9 అడుగులకు చేరింది.

Yamuna Waters Reach Taj Mahal Walls For First Time in 45 Years, Garden Flooded

గడిచిన 45 ఏళ్లలో తొలిసారిగా చారిత్రక కట్టడమైన తాజ్‌ మహల్‌ పరిసరాల్లోకి యమునా నది వరద నీరు ప్రవేశించింది. తాజ్‌మహల్ గోడల్లో, గార్డెన్‌లో భారీగా వరదనీరు నిలిచింది. ఆదివారం రాత్రి తాజ్‌మహల్ దగ్గర యమునా నది వరద గరిష్ఠ స్థాయి అయిన 495 అడుగులను దాటి 497.9 అడుగులకు చేరింది. దాంతో వరదనీరు తాజ్‌మహల్‌ పరిసరాల్లోకి ప్రవేశించింది. అయితే ఈ వరదనీరు వల్ల తాజ్‌మహల్‌కు వచ్చిన ముప్పేమీ లేదని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్‌ ఇండియా (ASI) వాళ్లు ప్రకటించారు. భారీ వరదల వర్షాలవల్ల యమునా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. పలు ప్రాంతాల్లో వరద నీరు పొంగిపొర్లింది. దాంతో యమునా పరివాహకంలోని పలు లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి.

Yamuna Waters Reach Taj Mahal Walls For First Time in 45 Years, Garden Flooded

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)