Viral Video: వీడియో ఇదిగో, ఆడుకుంటున్న పిల్లలపైకి దూసుకొచ్చిన తాచు పామును కొరికి చంపిన పెంపుడు కుక్క, తాడు తెంపుకుని మరీ పరిగెత్తుకు వచ్చి..

ఇంటి యజమాని పంజాబ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం ఓ పాము తమ గార్డెన్ లోకి దూరిందని చెప్పారు. అక్కడ తన పిల్లలతో పాటు పనిమనిషి పిల్లలు ఆడుకుంటున్నారని తెలిపారు.

Pit Bull Saves Children By Killing King Cobra That Entered House In Uttar Pradesh

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో ఓ ఇంటిలో చోటుచేసుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటి యజమాని పంజాబ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం ఓ పాము తమ గార్డెన్ లోకి దూరిందని చెప్పారు. అక్కడ తన పిల్లలతో పాటు పనిమనిషి పిల్లలు ఆడుకుంటున్నారని తెలిపారు. పామును చూసి వారంతా భయంతో కేకలు వేశారని తెలిపారు. అది విని తమ బుల్ డాగ్ జెన్నీ, తాడు తెంపుకుని మరీ పిల్లల దగ్గరికి పరుగెత్తుకు వెళ్లిందన్నారు.

ఐఫోన్ కొని పార్టీ ఇవ్వలేదని చంపేశారు, ఢిల్లీలో దారుణం, కత్తితో పొడిచి చంపేసిన స్నేహితులు

పామును నోటితో బంధించి నేలకేసి కొట్టడం మొదలుపెట్టిందని చెప్పారు. కాసేపటికి పాము చనిపోయిందని, కదలికలు లేకపోవడంతో జెన్నీ దానిని వదిలిపెట్టిందని తెలిపారు. తమ ఇంటికి పక్కనే పొలాలు ఉండడంతో తరచుగా పాములు గార్డెన్ లోకి వస్తుంటాయని అన్నారు. జెన్నీ ఇప్పటి వరకు ఓ పది పాములను ఇలాగే చంపిందని పంజాబ్ సింగ్ వివరించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు