Volcano Erupts in Indonesia: వీడియో ఇదిగో, ఒక్కసారిగా బద్దలైన మౌంట్ లెవొటోబి లకిలకి అగ్నిపర్వతం, తన్నుకొచ్చిన లావా వేడి దెబ్బకు 9 మంది మృతి
ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. అగ్నిపర్వతం గురువారం నుంచి ప్రతిరోజూ దాదాపు 2వేల మీటర్ల ఎత్తున మందంపాటి బూడిదను వెదజల్లుతున్నట్లు తెలిపారు
ఇండోనేసియాలోని ఫ్లోర్స్ దీవిలోని మౌంట్ లెవొటోబి లకిలకి(Mount Lewotobi Laki-Laki) అగ్నిపర్వతం(volcano) ఒక్కసారిగా బద్దలైంది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. అగ్నిపర్వతం గురువారం నుంచి ప్రతిరోజూ దాదాపు 2వేల మీటర్ల ఎత్తున మందంపాటి బూడిదను వెదజల్లుతున్నట్లు తెలిపారు. ఈ విస్ఫోటనాలు డేంజర్ జోన్‌ను దాటిపోయాయని అధికారులు ప్రకటించారు.
కెనడాలో టెస్లా కార్లు ఢీకొని ఒక్కసారిగా ఎగసిన మంటలు, మంటల్లో నలుగురు భారతీయులు సజీవ దహనం
అగ్నిపర్వతం మందంపాటి బూడిదను వెదజల్లుతుండటంతో ఆ వేడి బూడిద పడి సమీపంలోని పలు నివాసాలు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. దీంతో పాటుగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పైగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. త్వరగా గ్రామాలను ఖాళీ చేయించి, అక్కడి నివాసితులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నాం’’ అని వోల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ (PVMBG) సెంటర్ ప్రతినిధి హడి విజయ తెలిపారు.
Volcano Erupts in Indonesia:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)