Mamata Banerjee Jogging In Saree: చీర, చెప్పులు ధరించి మమతా బెనర్జీ జాగింగ్ చేస్తున్న వీడియో ఇదిగో, ప్రతి రోజు ఉదయాన్నే జాగింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని సూచన
ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పెయిన్ (Spain)పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మాడ్రిడ్‌లోని ఒక పార్కులో తన బృందంతో కలిసి జాగింగ్ చేస్తున్న వీడియోను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.దీదీ తెల్ల చీరను ధరించి, రబ్బరు చెప్పులతో జాగింగ్ చేశారు.
ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పెయిన్ (Spain)పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మాడ్రిడ్‌లోని ఒక పార్కులో తన బృందంతో కలిసి జాగింగ్ చేస్తున్న వీడియోను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.దీదీ తెల్ల చీరను ధరించి, రబ్బరు చెప్పులతో జాగింగ్ చేశారు. ఈ వీడియో షేర్ చేస్తూ.. దానికి క్యాప్షన్ కూడా జోడించారు. ‘‘ప్రతి రోజు ఉదయాన్నే జాగింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ వ్యాయామం మీకు శక్తినిస్తుంది. అందరూ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండండి’’ అని రాసుకొచ్చారు.
12 రోజుల పాటు దుబాయ్, స్పెయిన్ పర్యటనకు వెళ్లిన దీదీ ప్రముఖ స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ అయిన లా లిగా అధ్యక్షుడితో చర్చలు జరపనున్నట్లు సమాచారం. లా లిగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రొఫెషనల్ స్పోర్ట్స్ లీగ్‌లో ఒకటి.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)