Wayanad Landslide: వయనాడ్ పెను విషాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు పరిహారం ప్రకటన

కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌తో మాట్లాడాను. కేంద్రం నుంచి అందించగల అన్నిరకాల సహాయాలు చేస్తాము’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందినవారికి పీఎం ఎన్‌ఆర్‌ఎఫ్‌ కింద రూ.2 లక్షలు పరిహారం చెల్లిస్తారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. క్షతగాత్రులకు రూ.50,000 ఇవ్వనున్నట్లు ఎక్స్‌లో పేర్కొంది.

PM Modi (photo-ANI)

Wayanad Landslide Live Updates: కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందినవారి సంఖ్య  44కు (Death Toll Rises to 44) పెరిగింది. వందలాదిమంది మట్టిపెళ్లల కింద, బుదరలోను చిక్కుకుపోయారు.ఈ పెను విధ్వంసం జరగడంపై ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. బాధితులను ఆదుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకొంటున్నట్లు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం విచారకరమన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థించారు.  వయనాడ్‌లో శిథిలాల కింద చిక్కుకుని కాపాడాలంటూ బాధితుల ఆర్తనాదాలు, 44కు పెరిగిన మృతుల సంఖ్య, ఆర్మీ సహాయం కోరిన కేరళ సీఎం పినరయి విజయన్

Here's Tweet