PM Modi Speech in Rajya Sabha: ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసింది మీరే, ఆర్టికల్ 356 సాయంతో 50 సార్లకు పైగా ప్రభుత్వాలను కూలదోశారు, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాజ్యసభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలకులు ఆర్టికల్ 356ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఇందిరాగాంధీ ఆర్టికల్ 356 సాయంతో 50 సార్లకు పైగా ప్రభుత్వాలను కూలదోశారని ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాజ్యసభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలకులు ఆర్టికల్ 356ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఇందిరాగాంధీ ఆర్టికల్ 356 సాయంతో 50 సార్లకు పైగా ప్రభుత్వాలను కూలదోశారని ఆరోపించారు. ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికా వెళితే ఆయన ప్రభుత్వాన్ని కూల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ధ్వజమెత్తారు. ఎంజీఆర్ వంటి దిగ్గజాల ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీ అక్రమంగా పడగొట్టిందని మోదీ వివరించారు. కాంగ్రెస్ పాలకులు 600కి పైగా పథకాలకు గాంధీ, నెహ్రూ పేర్లు పెట్టారని విమర్శించారు. గాంధీ పేరు ఉన్న నేతలు ఇంటి పేరులో నెహ్రూ అని ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)