Weather Forecast: భ‌గ‌భ‌గ మండిపోతున్న భానుడు, 5 రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు, ఢిల్లీలో అత్య‌ధికంగా 46 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్ర‌త నమోదు

దీంతో దేశ‌వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు నమోదు అవుతున్నాయి. పంజాబ్‌, హ‌ర్యానా, రాజ‌స్థాన్‌, యూపీ, ఢిల్లీ రాష్ట్రాల్లో మ‌రికొన్ని రోజుల పాటు అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కానున్న‌ట్లు ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఎండ‌ల్లో తిర‌గ‌వ‌ద్ద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ త‌న వార్నింగ్‌లో పేర్కొన్న‌ది.

Image Used For Representational Purposes (Photo Credits: JBER)

దేశ‌వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు నమోదు అవుతున్నాయి. పంజాబ్‌, హ‌ర్యానా, రాజ‌స్థాన్‌, యూపీ, ఢిల్లీ రాష్ట్రాల్లో మ‌రికొన్ని రోజుల పాటు అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కానున్న‌ట్లు ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఎండ‌ల్లో తిర‌గ‌వ‌ద్ద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ త‌న వార్నింగ్‌లో పేర్కొన్న‌ది. అయితే మే 3వ తేదీ త‌ర్వాత ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఐఎండీ వెల్ల‌డించింది. తీవ్ర‌మైన ఎండ‌ల వ‌ల్ల ప‌లు ఉత్త‌రాది రాష్ట్రాల్లో విద్యుత్తు స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డింది. హ‌ర్యానాలో క‌రెంటు కోత అధికంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఢిల్లీలో అత్య‌ధికంగా 46 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. పాటియాలాలో 45.9 డిగ్రీలు, సిర్సా 45.7 డిగ్రీలు, గురుగ్రామ్ 45.6 డిగ్రీలు, జింద్ 44.7 డిగ్రీలు, అమృత్‌స‌ర్ 44 డిగ్రీలు, చంఢీఘ‌డ్ 42.2 డిగ్రీలు, గురుదాస్పూర్ 40.6 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)